గుడ్లు, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలి
భువనగిరిటౌన్ : కోడి గుడ్లు, వంటగ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతూ మధ్యాహ్న భోజన వంట కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. గుడ్డు, వంట గ్యాస్‌కు ప్రభుత్వం చెల్లిస్తున్న రేటు దేనికీ చాలడం లేదని, మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచాలని కోరా రు. వారికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, కార్యవర్గసభ్యులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాగుల వసంత, జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, బుచ్చమ్మ, కృష్ణ, మణెమ్మ, నిర్మల, ఉమా, సంధ్య, మంగ, లత, పుష్ప, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment