నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తా
ఆలేరు నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.
- 9లో
ఇంటర్‌బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
భువనగిరి : ఇంటర్ ప్రాక్టికల్పరీక్షల సందర్భంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే ఇంటర్‌బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ గురువారం తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల అధికార ప్రతినిధి ఎస్బీ మల్లేశం ఆధ్వర్యంలో డీఐఈఓ రమణికి వినతిపత్రం అందజేశారు. సీసీ కెమెరాలు చేయడం వల్ల విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. నిర్ణయాన్ని ఉపసంహరించకపోతే పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు కళాశాలలను ఇవ్వబోమన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శి బత్తుల శంకర్, జాయింట్ కార్యదర్శి మదిర మల్లేశం, దరిపల్లి ప్రవీణ్, జంగయ్య, మల్లేశం, పరశురాం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment