పొట్టిమర్రి వాగు వద్ద బారికేడ్లు ఏర్పాటు
రాజాపేట: మండలంలోని కాల్వపల్లి – పొట్టిమర్రి గ్రామాల మధ్య గురువారం పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మల్లన్నసాగర్ నుంచి వస్తున్న గోదావరి జలాలతో గంధమల్ల చెరువు నిండి అలుగుపోస్తుండడంతో పొట్టిమర్రి వాగుకు నీటి ఉధృతి పెరిగింది. కల్వర్టుపైనుంచి ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తుండడంతో ‘పొట్టిమర్రి వాగు పరవళ్లు’ శీర్షికతో గురువారం సాక్షిలో ప్రచురితమైంది. అప్రమత్తమైన పోలీసులు వాగులోనుంచి రాకపోకలు సాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాజాపేట నుంచి యాదగిరిగుట్ట వైపు వెళ్లేవారు రఘునాథపురం నుంచి వెళ్లాలని సూచించారు.
వాగులో పడిపోయిన దంపతులు –8లో
Comments
Please login to add a commentAdd a comment