భువనగిరి : ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 1వ తేదీన ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ భాషపై నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ప్రభుత్వం గత విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలకు శ్రీకారం చుట్టింది. మొదట ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే పరీక్ష ఉండగా, ఈ విద్యా సంవత్సరంనుంచి సెకండియర్‌కు కూడా ఇంగ్లిస ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం మార్కుల్లో 80 థియరీకి, ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయించారు. నాలుగు దశల్లో నిర్వహించే ఈ పరీక్షల్లో కనీసం 7 మార్కులు వస్తేనే ఉత్తీర్ణులవుతారు. గైర్హాజరైన విద్యార్థులను అనుత్తీర్ణులుగా పరిగణిస్తారు. జిల్లా వ్యాప్తంగా 64 కళాశాలలు ఉండగా వాటిలో 14,400 మంది విద్యార్థులు ఉన్నారు.
ఇంగ్లిష్‌లో ఒక్క నిమిషం మాట్లాడాల్సిందే..
ఇంటర్ విద్యార్థుల్లో ఇంగ్లిష్ పట్ల భయాన్ని పోగొట్టేందుకు ఇంటర్ బోర్డు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పరీక్షలు మూస పద్ధతిలో కాకుండా ప్రాక్టికల్‌గా నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి విద్యార్థి తమకు ఇష్టమైన టీచర్, క్రీడలు.. ఇలా 30 అంశాల్లో ఎదో ఒక అంశం గురించి నిమిషం పాటు మాట్లాడాల్సి ఉంటుంది.
ఫ జిల్లాలో 64 జూనియర్ కళాశాలలు
ఫ 14,400 మంది విద్యార్థులు
ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment