
ఓటెత్తిన ఉపాధ్యాయులు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉమ్మడి జిల్లాలో 94.98 శాతం పోలింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి యాదాద్రి: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయ ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 10 గంటల వరకు మందకొడిగా వచ్చిన ఓటర్లు ఆ తరువాత అధిక సంఖ్యలో వచ్చారు. గంట గంటకు ఓటర్ల రాక పెరిగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ భారీగా నమోదైంది. మొత్తానికి నిర్దిష్ట సమయానికే సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 94.98 శాతం పోలింగ్ నమోదైంది
పోలింగ్ కేంద్రాల వద్ద సంఘాల హడావుడి
గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారం సాగించిన ఉపాధ్యాయ సంఘాలు.. పోలింగ్ రోజు కూడా హడావుడి చేశాయి. భువనగిరిలో ఓ అభ్యర్థి మద్దతుదారులు ఏర్పాటు చేసిన టెంట్లను పోలీసులు తొలగించారు. ముఖ్యంగా బీజేపీ, పీఆర్‌టీయూ, పలువురు ఇండిపెండెంట్ తరపున వారి ప్రతినిధులు ప్రచారం చేయడం కనిపించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, నాయకులు గూడూరు నారాయణరెడ్డి, పాశం భాస్కర్, ఊట్కూరి అశోక్‌గౌడ్ భువనగిరిలో స్థానిక నాయకుల ద్వారా ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు, ఆర్ముడ్ రిజర్వు పోలీసులతో ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు.
ఫ పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు
ఫ మధ్యాహ్నం 2 గంటల వరకే 76 శాతం నమోదు
ఫ 4 గంటల వరకు ముగిసిన పోలింగ్
ఫ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ హనుమంతరావు
ఫ నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు
ఉమ్మడి జిల్లాలో పోలింగ్ శాతం ఇలా..
జిల్లా ఓటర్లు పోలైన ఓట్లు శాతం
యాదాద్రి 984 950 96.54
సూర్యాపేట 2,664 2,530 94.97
నల్లగొండ 4,683 4,433 94.66

ఓటెత్తిన ఉపాధ్యాయులు

ఓటెత్తిన ఉపాధ్యాయులు
Comments
Please login to add a commentAdd a comment