
ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం
భువనగిరి : నేషనల్ ఇనిస్టిస్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చెందిన డాక్టర్ మీతా చౌదరి నేతృత్వంలో కేంద్ర అధికారుల బృందం గురువారం భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించింది. ఆస్పత్రిలో ఫార్మసీ, నర్సింగ్ సేవలపై తెలుసుకున్నారు. అనంతరం 15వ ఆర్థిక సంఘం, ఆరోగ్యశాఖ నిధులతో చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వైద్యసేవలను బలో పేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలు మెరుగుపర్చడంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ పబ్లిక్ ఫైనాన్స్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఆరోగ్యసేవలు మెరుగుపర్చేందుకు 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు. ఆస్పత్రిలో రోగులకు అందజేస్తున్న వైద్యసేవలు, కార్యక్రమాల అమలుపై అధికారుల బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ చిన్ననాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు శిల్పిని, యశోద, ప్రోగ్రాం అధికా రులు సాయిశోభ, సుమన్‌కళ్యాణ్ పాల్గొన్నారు.
ఫ మౌలిక వసతులు, వైద్య సేవలపై అధ్యయనం
Comments
Please login to add a commentAdd a comment