
భువనగిరికి చేరిన అఖండ జ్యోతి రథయాత్ర
బీబీనగర్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ బర్కత్‌పురలోని యాదగిరి భవన్ నుంచి బయలుదేరిన స్వామివారి అఖండజ్యోతి రథయాత్రకు బీబీనగర్‌లో అఖండజ్యోతి కమిటీ సభ్యులు, భక్తులు, రాజకీయ నాయకులు ఘన స్వాగతం పలికారు. బాంబినో వర్మిసెల్లీ పరిశ్రమ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ప్రణీతాపింగళ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మీశ్రీనివాస్, నాయకులు శ్యాంగౌడ్, అంజనేయులు, సత్యనారాయణగౌడ్ బాంబినో కంపెనీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, మేనేజర్ శాస్త్రి, పీఆర్ రఫిక్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి : అఖండజ్యోతి రథయాత్రకు భువనగిరి పట్టణంలో యాత్ర చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులు ఘన స్వాగతం పలికారు. హైదరా బాద్, నల్లగొండ, జంకానగూడెం చౌరస్తాల మీదుగా బస్టాండ్ సమీపం నుంచి వినాయక చౌరస్తా, పాత బస్టాండ్ మీదగా పాత వివేరా హోటల్ వద్దకు రథయాత్ర చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపల్ల బుచ్చిరెడ్డి, జ్ఞాన ప్రకాష్‌రెడ్డి, ఫక్కీర్ కొండల్‌రెడ్డి, శెట్టి బాలయ్యయాదవ్, మంచి కంటి వెంకటేశం, దిడ్డి బాలాజీ, దేవరకొండ నర్సింహాచారి, చీకటి మల్ల రాములు, బండారు శ్రీనివాస్, చందా మహేందర్ గుప్తా, మల్లేశం, నర్సింగ్‌రావు పాల్గొన్నారు. శనివా రం ఉదయం రథయాత్ర యాదగిరిగుట్టకు బయ లుదేరనుందని నిర్వాహకులు తెలిపారు.

భువనగిరికి చేరిన అఖండ జ్యోతి రథయాత్ర
Comments
Please login to add a commentAdd a comment