
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
భువనగిరి : ఇంటర్ పరీక్షలకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని, లోపాలకు తావుండవద్దని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సీఎస్, డీఓలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలకు శుక్రవారం కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై వారికి సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 29 కేంద్రాల్లో 12,558 విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని.. ఇందులో ప్రథమ సంవత్సరం 6,208, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,350 మంది ఉన్నారని తెలిపారు. కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. కేంద్రాలకు ప్రశ్న పత్రాలను తరలించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల బండిళ్లకు సీల్ తొలగించడం, సమాధాన పత్రాలను ప్యాకింగ్ చేసే ప్రక్రియ సీసీ కెమెరాల నిఘాలోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గంగాధర్, డీఐఈఓ రమణి తదితరులు పాల్గొన్నారు.
అధిక మార్కులు సాధించిన
70 మంది విద్యార్థులకు సైకిళ్లు
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన 70మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో సిద్ధంగా ఉంచిన సైకిళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. జిల్లాలోని 192 ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 6,074 మంది ఉన్నట్లు తెలిపారు. కష్టపడి చదవి మంచి మార్కులు సాధించాలని కోరారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వడంతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, డీఈఓ సత్యనారాయణ, ఐఓసీఎల్, నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment