భువనగిరి : వేసవిలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ సీజీఎం చక్రపాణి సూచించారు. శనివారం భువనగిరిలోని ఎస్‌ఈ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమావేశమైన వేసవిలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు రూపొందించిన యాక్షన్‌ప్లాన్‌ను సమీక్షించారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని, కొత్తగా చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. సరఫరాలో ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ సుధీకర్‌కుమార్, భువనగిరి, చౌటుప్పల్ డీఈలు వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, డీఈ టెక్నికల్ శ్రీనివాసచారి, డీఈఎంఎల్‌టీ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment