భువనగిరిటౌన్ : సన్‌డే మండిపోయింది. ఎండలు మళ్లీ ఒక్కసారిగా పెరడగంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం జిల్లాలో అత్యధికంగా సంస్థాన్‌నారాయణపురం మండలంలో 38.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. సగం మండలాల్లో 37 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలుకావడంతో సాయంత్రం 4 గంటల వరకు రహదారులపై జనసంచారం తక్కువగా కనిపించింది. ఉష్ణోగ్రతలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. వచ్చినా తలపై టోపీ లేదా గొడుగు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment