భువనగిరిటౌన్ : ఆలేరు మండలం కొలనుపాకలో సర్వే నంబర్‌లో 8లో గల రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అర్హులైన పేదలకు పంపినీ చేయాలని కోరుతూ సీపీఎ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. గ్రామంలో ఎంతోమది నిరుపేదలు ఉన్నారని, వారికి ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలని ఎప్పటినుంచో అధికారులను కోరుతున్నా స్పందించడం లేదన్నారు. అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికై నా అధికారులు స్పందించాలని కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చెక్క వెంకటేష్, కనకయ్య, పొన్నబోయిన రవి, గిరబోయిన సామి, పోతు ప్రవీణ్, మోతే భవాని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment