
ఆరున్నరేళ్లకు.. అంతిమతీర్పు
పకడ్బందీగా దర్యాప్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రణయ్ హత్య కేసును పోలీసు యంత్రాంగం పకడ్బందీగా దర్యాప్తు చేసింది. కేసు విచారణ, పక్కాగా సాక్ష్యాల సేకరణ, వాటి అథెంటికేషన్ విషయంలో అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు బృందాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాయి. తమిళనాడులో శంకరన్ హత్య కేసు తరహాలో ప్రణయ్ హత్య కేసు విచారణ జరిగింది. తమిళనాడులో కులాంతర వివాహం చేసుకున్న శంకరన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. అక్కడ ఆయన హత్యకు గురయ్యాడు. ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తమిళనాడు పోలీసులు నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కాగా విచారణ జరిపారు. అందుకే ప్రణయ్ హత్య తరువాత అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు అధికారుల బృందం అక్కడికి వెళ్లి ఆ కేసును కూడా పరిశీలించింది. ప్రణయ్ హత్య కేసులోనూ నిందితులు తప్పించుకోకుండా, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా, సాంకేతిక పద్ధతుల్లో వాటిని భద్రపరిచారు. ముఖ్యంగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, బ్లడ్ శాంపిల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్ష చేయించారు. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రణయ్ హత్యకు ముందు నిందితులు ఏయే ప్రాంతాల్లో సంచరించారు.. ఎవరెవరు కలుసుకొని ప్లాన్ చేశారు.. అనే వివరాలు సేకరించి అన్ని ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఈ కేసులో ఎలాంటి అవకతవకలకు, అనుమానాలకు తావులేకుండా నేరం రుజువయ్యేలా సేకరించిన అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. తద్వారానే సుభాష్ కుమార్ శర్మకు అప్పట్లో బెయిల్ రాలేదు. కేసు విచారణ తుది తీర్పులో సుభాష్ శర్మకు ఉరి శిక్ష, మిగిలిన వాళ్లకు జీవిత ఖైదు పడిందని, తద్వారా బాధితులకు సత్వర న్యాయం జరిగిందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.
ప్రణయ్ హత్య కేసులో కరుడుగట్టిన నేరస్తుడు అజ్గర్ అలీ
ఫ ప్రధాన పాత్రధారి అబ్దుల్‌బారి ఫ సుభాష్‌కుమార్ శర్మను తీసుకొచ్చింది బారీనే
ఫ 1,600 పేజీల్లో చార్జిషీట్ రూపొందించి కోర్టులో సమర్పించిన పోలీసులు

ఆరున్నరేళ్లకు.. అంతిమతీర్పు

ఆరున్నరేళ్లకు.. అంతిమతీర్పు

ఆరున్నరేళ్లకు.. అంతిమతీర్పు
Comments
Please login to add a commentAdd a comment