
వైద్య విద్యార్థులకు సామాజిక దృక్పథం ఉండాలి
బీబీనగర్: వైద్య వృత్తి చాలా ప్రధానమైనదని, వైద్య విద్యార్థులు సామాజిక దృక్పథంతో ఉంటూ రోగుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిమ్స్‌లోని విద్యార్థులకు చాలా చక్కటి భవిష్యత్త్ ఉందన్నారు. వరల్డ్‌లోనే బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాల బెస్ట్‌గా నిలుస్తుందన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయన్నారు. ఐదేళ్లలోనే అబ్బురపరిచే విధంగా భవనాల నిర్మాణాలు జరగడం సంతోషదాయకమని అన్నారు. రోగులతో సాన్నిహిత్యం కలిగి ఉండాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ బాటియా మాట్లాడుతూ.. ఎయిమ్స్‌లోని ఔట్‌పేషెంట్ విభాగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11లక్షల మంది వైద్య సేవలు పొందారని, 34రకాల వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం ఎయిమ్స్ పురోగతిపై ముద్రించిన మ్యాగ్జిన్‌ను డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించడంతో పాటు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జలలీమ్, రాహుల్‌నారంగ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment