భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(ఎస్‌ఆర్టీఆర్‌ఐ)లో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీ్త్రలకు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల, కొంగరకలాన్‌లోని ప్రముఖ మొబైల్ కంపెనీలలో, పురుషులకు ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ప్రముఖ ఏసీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పదో తరగతి, ఆపై చదివిన వారు అర్హులని అన్నారు. ఎంపికై న సీ్త్ర, పురుషులకు రూ.14,500 నుంచి రూ.16,500 జీతం, ఉచిత బస్సు, భోజన సదుపాయం, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పిస్తామని, ఆసక్తి కల్గిన వారు విద్యార్హతల సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. వివరాలకు 994846111, 7540084221ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment