17లోగా సీఎంఆర్ అప్పగించండి
సాక్షి,యాదాద్రి : 2023–24 యాసంగి సీజన్‌కు సంబంధించి కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను ఈనెల 17లోగా ప్రభుత్వానికి అందజేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో మిల్లర్లు, అధికారులతో సమావేశమై సీఎంఆర్‌పై సమీక్షించారు. 96 శాతం సీఎంఆర్ పూర్తయ్యిందని, నాలుగు శాతం మా త్రమే పెండింగ్ ఉన్నందున గడువులోపు పూర్తి చేసి జిల్లాను ముందంజలో ఉంచాలని కోరారు. ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని ఎవరైనా దుర్విని యోగం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో సీఎంఆర్ అప్పగించని మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేయబోమని చెప్పారు. సమావేశంలో మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మార్త వెంకటేశం, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment