12 నెలలుగా పైసా ఇవ్వలేదు!
‘ఉపాధి’ కార్యాలయాలకు నిలిచిపోయిన నిధులు
గ్రాంట్ విడుదల చేయాలి
2022 ఆర్థిక సంవత్సరం వరకు పనిదినాలతో పనిలేకుండా ఖర్చు చేసిన బిల్లులను ప్రభుత్వం చెల్లించేది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి స్లాబ్ విధానం తీసుకువచ్చారు. మూడునెలలకు ఒకసారి విడుదల చేయవలసిన గ్రాంట్ 12 నెలలుగా పెండింగ్‌లో ఉన్నది. చేతినుంచి విద్యుత్, స్టేషనరీ, రిపేర్లు, నీటి బిల్లులు చెల్లించవలసి వస్తుంది. ప్రభుత్వం స్పందించి నిర్వహణ గ్రాంట్స్‌ను పూర్తిగా విడుదల చేయాలి.
–శ్రీలక్ష్మి, ఏపీఓల
సంఘం జిల్లా అధ్యక్షురాలు
రామన్నపేట : ఉపాధిహామీ కార్యాలయాల నిర్వహణ భారంగా మారింది. ఏడాది కాలంగా ప్రభుత్వం నిధులు విధిల్చకపోవడంతో ఏపీఓలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్, నెట్ బిల్లులు, స్టేషనరీ కొనుగోలు తదితర అవసరాలకు చేతినుంచి ఖర్చు చేస్తున్నారు.
2024 ఏప్రిల్ నుంచి పెండింగ్
ప్రతి మండల కేంద్రంలో భారత్ నిర్మాణ్ రాజీవ్‌గాంధీ సేవాకేంద్రం పేరుతో ప్రభుత్వం ఉపాధిహామీ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణకు పనిదినాల ప్రాతిపదికన ఏటా మూడు స్లాబ్‌లుగా నిధులు విడుదల చేస్తుంది. 2 లక్షలలోపు పనిదినాలు పూర్తయిన మండలానికి రూ 65వేలు, 2 లక్షల నుంచ ఇ 3లక్షల పనిదినాలు పూర్తయితే రూ.85వేలు, 3 లక్షలకు పైగా పనిదినాలు రూ.లక్ష చొప్పున చెల్లిస్తుంది. వీటిని ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తుంది. చివరిసారి 2024 మార్చినెల వరకు నిధులు వచ్చాయి. 2024 ఏప్రిల్ నుంచి నిర్వహణ గ్రాంట్ పెండింగ్‌లో ఉన్నది.
ఏపీఓలపై నిర్వహణ భారం
ప్రభుత్వం ఇచ్చే నిర్వహణ గ్రాంట్‌ను విద్యుత్, నెట్ బిల్లులు, స్కావెంజర్ చార్జీలు చెల్లించాలి. కంప్యూటర్లు, ఫ్యాన్లు, ఇతర ఫర్నిచర్ చెడిపోతే మరమ్మతులు చేయించాలి.కంప్యూటర్ల నిర్వహణకు అవసరమైన క్యాట్రేజీ, స్టేషనరీ కొనుగోలు చేయాలి. స్వాతంత్య్ర, గణతంత్ర, రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించాలి.శానిటేషన్ నిర్వహణకు అవసరమైన వస్తువులను సమకూర్చుకోవాలి. 12 నెలలకు సంబంధించిన గ్రాంట్ పెండింగ్‌లో ఉంది. పైగా ఉపాధి ఉద్యోగులకు మూడునెలలుగా వేతనాలు రావడం లేదు. దీంతో తమ కుటుంబ బాధ్యతలతో పాటు, కార్యాలయాల నిర్వహణ ఉద్యోగులకు తలకుమించిన భారంగా మారింది.
ఫ భారంగా మారిన నిర్వహణ
ఫ విద్యుత్, నెట్ బిల్లులు, స్టేషనరీకి
సొంత డబ్బులు ఖర్చు చేస్తున్న ఏపీఓలు
12 నెలలుగా పైసా ఇవ్వలేదు!
Comments
Please login to add a commentAdd a comment