అభివృద్ధికి ఊపు
పరిధి పెంపు..
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025
సాక్షి, యాదాద్రి : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అఽథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధి మరింత పెరిగింది. రీజినల్ రింగ్ రోడ్డు ఆవల రెండు కిలో మీటర్ల దూరం వరకు విస్తరించనుంది. రీజినల్ రింగ్ రోడ్డు వరకు సమగ్రాభివృద్ధి, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని 162 గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. ఇందుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు అధికారులు కసరత్తు ప్రారంభించారు
సెమీ అర్బన్ ఏరియాగా..
హెచ్‌ఎండీఏ పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిని కోర్ అర్బన్ సిటీగా, ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ ఏరియాగా నిర్ధారించింది. కాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మలరామారం మండలాల వరకు హెచ్‌ఎండీఏ పరిధి ఉంది. భవిష్యత్ అవసరాల నేపథ్యంలో దీన్ని రీజినల్ రింగ్ రోడ్డు ఆవలి దాకా పెంచారు. దీంతో కొత్తగా తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, వలిగొండ, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లోని పలు గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ హైదరాబాద్‌గా పరిగణించనున్నారు. దీని పరిధిలోకి మొత్తం 162 గ్రామాలు రానున్నాయి.
అనేక ప్రయోజనాలు
హెచ్‌ఎండీఏ పరిధి పెరగడం ద్వారా జిల్లాకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. శాటిలైట్ టౌన్‌షిప్‌లు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. యాదాద్రి జిల్లా మీదుగా ఇప్పటికే రెండు జాతీయ రహదారులు (65, 163), రెండు రైల్వే మార్గాలు (సికింద్రాబాద్–ఖాజీపేట, బీబీనగర్– నడికుడి) ఉన్నాయి. కొత్తగా గౌరెల్లి – భద్రాద్రి కొత్తగూడెం వరకు జాతీయ రహదారి నిర్మాణంలో ఉండగా.. సంగారెడ్డి – భువనగిరి వయా చౌటుప్పల్, కంది వరకు మరో నేషనల్ హైవే 161 ఏఏ పనులు ప్రారంభం కానున్నాయి.
న్యూస్‌రీల్
హెచ్‌ఎండీఏ పరిధి పెంచుతూ ఉత్తర్వులు
ఫ రీజినల్ రింగ్ రోడ్డు ఆవల రెండు కిలో మీటర్ల వరకు..
ఫ ఔటర్ నుంచి ‘రీజినల్’ వరకు సెమీ అర్బన్‌గా గుర్తింపు
ఫ దీని పరిధిలోకి మొత్తం 162 గ్రామాలు
ఫ సమగ్ర అభివృద్ధి, భవిష్యత్ అవసరాల దృష్ట్యా నిర్ణయం
ఫ మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు సన్నాహాలు
కొత్తగా కలిపే గ్రామాలు ఇవీ..
సంస్థాన్‌నారాయణపురం మండలంలోని చిల్లాపురం, చిమిర్యాల, గుడ్డిమల్కాపురం, జనగామ, కంకణాలగూడెం, కొత్తగూడెం, కోతులాపురం, మహ్మదాబాద్, నారాయణపురం, పుట్టపాక, రాచకొండ, సర్వేల్, వాయిలపల్లి
తుర్కపల్లి మండలంలో చినలక్ష్మాపురం, దత్తాయిపల్లి, ధర్మారం, గంధమల్ల, గోపాలపురం, ఇబ్రహీంపురం, కోమటికుంట, కోనాపురం, కొండాపురం, మాదాపురం, మల్కాపురం, తుర్కపల్లి, ముల్కలపల్లి, నాగాయపల్లి, పల్లెపహాడ్, రుస్తాపురం, శ్రీనివాసపురం, తిరుమలాపురం, వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, వేలుపల్లి, వెంకటాపురం.
వలిగొండ మండలం గోకారం, కంచనపల్లి, పహిల్వాన్‌పురం, పొద్దటూరు, రెడ్లరేపాక, సంగెం, టేకులసోమవారం, వర్కట్‌పల్లి
యాదగిరిగుట్ట మండలంలో జంగంపల్లి
రాజాపేట మండలంలో బేగంపేట, చల్లూరు
అభివృద్ధికి ఊపు
Comments
Please login to add a commentAdd a comment