సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
భూదాన్‌పోచంపల్లి : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భూదాన్‌పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యశోద, మండల వైద్యాధికారిణి శ్రీవాణి, వైద్య సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అదే విధంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులతో మాట్లాడారు. పౌష్టికాహారం ఆవశ్యకత, ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ పోతారెడ్డి, చౌటుప్పల్ డివిజన్ హెల్త్ ఎడ్యుకేటర్ వసంత, సూపర్‌వైజర్ అరుంధతి, లక్ష్మణ్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
ఫ డీఎంహెచ్‌ఓ మనోహర్
Comments
Please login to add a commentAdd a comment