రోడ్డు ప్రమాదంలో వలస కూలీ దుర్మరణం
మిర్యాలగూడ టౌన్: ఆటోను లారీ ఢీకొనడంతో వలస కూలీ మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ సమీపంలో మంగళవారం జరిగింది. రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన కృష్ణకుమార్(22) మిర్యాలగూడకు వలస వచ్చి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం అతడు మిర్యాలగూడ నుంచి అడవిదేవులపల్లి వైపు ఆటోలో వెళ్తున్నాడు. మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ సమీపంలో గల సాంబశివ రైస్ మిల్లు వద్ద జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణకుమార్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటో డ్రైవర్ అంజనేయులు, అతడి భార్య మాధవి, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునిమృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment