
ఆర్థిక భద్రత కల్పించేందుకే శిక్షణ
భూదాన్‌పోచంపల్లి : ఉపాధి హామీ కూలీ జీవనోపాదులు మెరుగుపర్చి, వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి స్వయం ఉపాధిలో శిక్షణ అందిస్తున్నామని డీఆర్‌డీఓ నాగిరెడ్డి తెలిపారు. భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలో డీఆర్‌డీఓ, ఎస్‌బీఐ, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధిహామీ పథకంలో వంద రోజుల పనిదినాలు పూర్తయిన కూలీలకు అగరుబత్తీల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. శనివారం శిక్షణ శిబిరాన్ని సందర్శించి వారికి యూనిఫాం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం కూలి పనులపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతి సాధించాలన్న ఉద్దేశంతో అగరుబత్తీల తయారీలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు యూనిట్ల స్థాపనకు బ్యాంకులు, సీ్త్రనిధి ద్వారా రుణ సహాయం అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధిహామీకూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రఘుపతి, ఎంపీడీఓ భాస్కర్, జాబ్స్ జిల్లా మేనేజర్ కేపీ రాజు, ఏపీఓ కృష్ణమూర్తి, ఏపీఎం నీరజ, కో ఆర్డినేటర్ శ్రీకాంత్, ట్రైనర్ శంకర్‌రావు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, టీఏ కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ అమృత, జెఆర్సీ పద్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
యాదగిరిగుట్టరూరల్: ప్రభు త్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ సత్యనారాయణ అన్నారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలోని ఎంపీపీఎస్, పీఎంశ్రీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం, స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో పీఎంశ్రీ పథకానికి ఐదు పాఠశాలలు ఎంపికవగా అందులో మల్లాపురం కూడా ఉందన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలోఉన్నత విలువలతో కూడిన విద్య అందుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కసిరెడ్డి కొండల్‌రెడ్డి, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగార్, ఎంఈఓ శరత్‌యామిని, రాములు, పుచ్చుల సంధ్య, ముత్యం రాములు, మంగు భాస్కర్, రాజశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆర్థిక భద్రత కల్పించేందుకే శిక్షణ