
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
మర్రిగూడ: ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్యులు కృషిచేయాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కె. అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం మర్రిగూడ మండల కేంద్రంలోని కమ్యూటనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రూ.3లక్షల విలువైన రెండు ఆక్సిజనేటర్ మిషన్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. త్వరలోనే ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు డయాలసిస్ సెంటర్‌ను, రోగులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూను పరిశీలించారు. ఓపీ థియేటర్‌ను ఉపయోగంలోకి తేవాలన్నారు. ఆస్పత్రికి సంబంధించిన ఇంక్యూబేషన్ అన్నిరకాల పరికరాలు కూడా అందుబాటులోకి తేవాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ మాత్రునాయక్, సూపరింటెండెంట్ శంకర్‌నాయక్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఫ తెలంగాణ వైద్య విధాన పరిషత్
కమిషనర్ అజయ్‌కుమార్