
‘ఎల్‌ఆర్‌ఎస్’ను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి,యాదాద్రి : అనధికార లే అవుట్‌లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులతో సమావేశం అయ్యారు. ఎల్‌ఆర్‌ఎస్ ఆవశ్యకత, ఫీజు రాయితీ గురించి వివరించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు ఈనెల 30వరకు గడువు ఉందని, మళ్లీ గడువు పొడిగించే అవకాశం లేకపోచ్చన్నారు. రెగ్యులరైజ్ చేసుకోని భూముల్లో రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, డీపీఓ సునంద పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు