గడ్డివాములు, బైక్ దగ్ధం
వేంపల్లె : గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో గడ్డివాములు, 2 మోటార్ బైకులు దగ్ధం అయినట్లు బాధితుడు తెలిపారు. ఆదివారం రాయచోటి–పులివెందుల బైపాస్ రోడ్డులో ఒక ప్రైవేట్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. బాధితుడి కథనం మేరకు.. గత నాలుగేళ్లుగా బైపాస్‌రోడ్డులో వరి గడ్డి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పు పెట్టడంతో పెద్దగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి ఫైర్ ఇంజన్ వారి సహకారంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే గడ్డివాము పూర్తిగా కాలి పోయింది. అలాగే పక్కనే ఉన్న 2 మోటార్ బైకులు కూడా కాలి పోయాయని బాధితుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment