అరుదైన ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి
కురబలకోట : జిడ్డు కృష్ణమూర్తి.. ఈపేరు ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినుతికెక్కారు. ఆధ్యాత్మిక, దార్శనిక, తాత్విక వేత్త. ఆయన ఫిలాసఫీ ఎందరినో కదిలించింది. జాతి, మత, దేశ, రాజకీయ ఆదర్శాలకు అతీతంగా విద్యార్థులకు విద్య నందించడమే నూతన ప్రపంచానికి మార్గమన్నారు. సత్యాన్వేషణతోనే జ్ఞానోదయం అని చాటి చెప్పిన ప్రపంచ తత్వవేత్తగా ఖ్యాతి గడించారు. ఆయన జీవిత విశేశేషాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మదనపల్లెలో పుట్టిన వాడిగా ఆయనలా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవారు లేరు. మదనపల్లెలో పుట్టి మద్రాస్ అడయార్‌లో పెరిగి ఆపై ప్రపంచ మాస్టర్‌గా ఎదిగారు. 60 ఏళ్లకు పైగా పలు దేశాలు పర్యటించారు. జీవన సందేశాన్ని వినిపించారు. విప్లవాత్మకమైన జీవన తాత్వికతను ప్రపంచానికి అందించారు. ప్రధానంగా సత్యాన్ని తెలుసుకోవడానికి దారులు లేవు. ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోవాలన్నారు. ఎవరినో ఆదర్శంగా తీసుకోవడం కన్నా నిన్ను నీవు తెలుసుకోవడం వల్ల సత్యాన్ని తెలుసుకోగలవన్నారు. సాంప్రదాయ విద్య కన్నా స్వతంత్ర ఆలోచన కలిగించే విద్య మనిషిని మేల్కొలుపుతుందన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండరాదన్నారు. మనిషిని పరిపూర్ణుడిగా చేయడమే విద్య కర్తవ్యమని బోధించారు. విద్యార్థి నిరంతరం నేర్చుకునే వాడిగా ఉండాలి. టీచర్ విద్యార్థిలోని సృజనాత్మకతను తట్టి మేల్కొలిపేలా ఉండాలి. మనసు నిండా ప్రేమను నింపుకున్న వారు మంచి తప్ప చెడు చేయలేరు. పదవులను ఆయన తృణప్రాయంగా ఎంచారు. అనిబిసెంట్ అప్పట్లో ఆయన్ను ప్రపంచానికి జగద్గురువును చేయాలని ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అనే అంతర్జాతీయ సంస్థకు అధినేతను చేశారు. అది నచ్చక 1926లో రద్దు చేయడంతో పాటు ఏకంగా దాని నుంచి వైదొలిగారు. 1895 మేలో జన్మించిన ఆయన 1986 ఫిబ్రవరి 17న శాశ్వత నిద్రలోకి వెళ్లారు.
నేడు వర్ధంతి
Comments
Please login to add a commentAdd a comment