పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కడప కోటిరెడ్డిసర్కిల్ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అలాగే ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయిల్ కంపెనీ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదివారం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ద్వారా, క్లీన్ ఎన్విరాన్‌మెంటల్ పర్యావరణ పరిరక్షణ అనే నినాదం కోసం కడప నగరంలోని మహావీర్ సర్కిల్‌వద్ద హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలింగ్ కార్పొరేషన్ ఆయిల్ ఇండస్ట్రీ సంస్థలకు చెందిన ప్రతినిధులు, సంబంఽధిత ఉద్యోగులు వాక్ థాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం ముడిసరుకు దిగుమతులపై ఆధారపడడం, తగ్గించడంలో మనందరం భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇంధన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించడంతోపాటు మహావీర్‌సర్కిల్ నుంచి రిమ్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూస్తాన్ పెట్రోలియం కడప ఆర్‌ఎం మన్మథరావు, చీఫ్ డిపో మేనేజర్ హెచ్‌పీసీఎల్ సతీష్‌కుమార్, వీడీపీఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఓబయ్య, రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్ గంగన్న, హెచ్‌పీసీఎల్, డీపీసీఎల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment