కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగరం సరోజినీ నగర్‌కు చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రిమ్స్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు సరోజినీ నగర్‌లో నివాసం ఉంటున్న షేక్ షబ్బీర్(35) టైల్స్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసయ్యాడు. కూలి డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా తాగుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో శనివారం అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య షకీలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విష ద్రావణం తాగి
వృద్ధురాలు..
కడప నగరం సరోజిని నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు ఆదివారం విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు రిమ్స్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. గురజాల చంద్రమ్మ(78) గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేది. ఈమెకు కొడుకు, ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ చర్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment