రైతుకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

రైతుకు గుర్తింపు

Published Mon, Feb 17 2025 12:57 AM | Last Updated on Mon, Feb 17 2025 12:52 AM

రైతుక

రైతుకు గుర్తింపు

కడప అగ్రికల్చర్‌: దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్‌కార్డుతో గుర్తింపు ఇచ్చినట్లుగా ప్రతి రైతులకు కూడా 11 అంకెలు కలిగిన యూనిక్‌ ఐడీ నెంబర్‌తో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డులను రైతులకు అందించేందుకు కేంద్రం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సాగు భూమి ఉన్న ప్రతి రైతుకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పత్రం జారీ పక్రియ జిల్లాలో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జిల్లాలో రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. జిల్లా మొత్తం 3,31,665 మంది రైతులు ఉండగా వీరిలో పీఎం కిసాన్‌కు సంబంధించి 1,93,253 మంది ఉన్నారు. వీరిలో 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లావ్యాప్తంగా ఎనిమిది వ్యవసాయ డివిజన్లకు సంబంధించి 61,368 మంది రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ నమోదు ప్రక్రియలో పులివెందుల డివిజన్‌ జిల్లాలో ప్రథమస్థానంలో నిలువగా కడప రెండవస్థానంలో నిలిచింది. రైతులకు ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేసి పథకాలను పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం.

నమోదుకు అవసరమైన

ధ్రువ పత్రాలు...

రైతు ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్‌, వన్‌బీ, ఆధార్‌కార్డుకు లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌ను రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్తారు. రైతు మొబైల్‌ ఫోన్‌కు మూడు ఓటీపీలు వస్తాయి, ఆ ఓటీపీలను వ్యవసాయ సిబ్బందికి తెలియచేస్తే రైతు యూనిక్‌ ఐడీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

రైతుకు ఒనగూరే ప్రయోజనాలు...

ఆధార్‌ మాదిరిగా యూనిక్‌ కోడ్‌తో జారీ చేసే ఈ కార్డులతో రైతులకు ఐడీ కార్డుగా ఉపయోగపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని పథకాలను రైతుల యూనిక్‌ కోడ్‌తో అనుసంధానం చేస్తారు. రానున్న రోజుల్లో ఈ యూనిక్‌ నెంబర్‌ ఉన్న రైతులకు వ్యవసాయ పథకాలు, ఎరువులు, పంటల బీమా అందుతాయని అధికారులు అంటున్నారు. అలాగే ఈ యూనిక్‌ నెంబర్‌ను ఉపయోగించి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా బ్యాంకు లింక్‌తో కూడిన సేవలు పొందవచ్చు. దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాలు వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీంతోపాటు పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయి. వీటితోపాటు ఇతర సేవలైన నీటి పారుదల, తెగుళ్ల నియంత్రణ, వాతావరణ సూచనలు వంటీ సేవలు కూడా పొందేందుకు వీలవుతుంది.

ఆధార్‌ తరహాలో 11 అంకెల నెంబర్‌ ఐడీ

సొంత భూమి ఉన్న వారే అర్హులు

భవిష్యత్తులో పథకాల అమలుకు అదే ప్రామాణికం

జిల్లాలో రైతు సేవా కేంద్రాల్లో ముమ్మరంగా నమోదు ప్రక్రియ

డివిజన్ల వారీగా రిజిస్ట్రేషన్‌

చేసుకున్న రైతులు

ప్రతి రైతు నమోదు చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫార్మర్‌ యూనిక్‌ ఐడీని ప్రతి రైతు పొందాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాలు ఈ ఐడీ కార్డు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

– అయితా నాగేశ్వరరావు,

జిల్లా వ్యవసాయ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
రైతుకు గుర్తింపు1
1/3

రైతుకు గుర్తింపు

రైతుకు గుర్తింపు2
2/3

రైతుకు గుర్తింపు

రైతుకు గుర్తింపు3
3/3

రైతుకు గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement