కమనీయం.. రంగనాథుని కల్యాణం
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వైభోగం కన్నుల పండువగా సాగింది. ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్ శర్మ ఆధ్వర్యంలో కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. సతీసమేతుడైన శ్రీరంగనాథుని ముగ్ధమోహన రూపాన్ని చూసి భక్తులు తరించారు. శాశ్వత కల్యాణ ఉభయదారులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన చల్లా నారాయణస్వామి, ఉమాదేవి దంపతులు, కుటుంబ సభ్యులచే కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం స్వామివారు సతీ సమేతుడై గజ వాహనంపై పట్టణ పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాయకర్పూరాలను సమర్పించారు.
నేడు బ్రహ్మరథోత్సవం: బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు సోమవారం ఉదయం రంగనాథస్వామి బ్రహ్మ రథోత్సవం (తేరు)నిర్వహించనున్నారు. బ్రహ్మరథం ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఆలయ చైర్మెన్ సుధీకర్‌రెడ్డి, ఈఓ రమణ పర్యవేక్షిస్తున్నారు.
కమనీయం.. రంగనాథుని కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment