● మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజద్‌బాషా
● ఘనంగా శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు
కడప కార్పొరేషన్: శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనాదక్షుడని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కొనియాడారు. ఆదివారం శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోటక్రిష్ణ ఆద్వర్యంలో స్థానిక స్థానిక క్రిష్ణా సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి మేయర్ సురేష్ బాబుతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్‌చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశ చరిత్రలో మధ్యయుగ రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు మహా కీర్తిశాలి అని తెలిపారు. ఆయన పరిపాలనలో పేద బడుగు బలహీన వర్గాల వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చారన్నారు. మనమందరం శ్రీకృష్ణదేవరాయల అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు టి.శివశంకర్, అమరప్ప, రాము,యానాదయ్య, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి,పి. జయచంద్రారెడ్డి, ఐస్‌క్రీం రవి, షఫీ,కిరణ్, బసవరాజు, శ్రీరంజన్ రెడ్డి, రామచంద్రయ్య, రామ్ లక్ష్మణ్ రెడ్డి,లక్ష్మయ్య, జిలాన్, అరీఫుల్లా, దేవిరెడ్డి ఆదిత్య, సుదర్శన్ రాయల్,రామ్మోహన్ రెడ్డి, సింధు, టి పి సుబ్బమ్మ పత్తి రాజేశ్వరి, మరియలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment