
భారతదేశ సంస్కృతి అంటే చాలా ఇష్టం
పులివెందుల టౌన్ : భారతదేశ సంస్కృతి, అలవాట్లు చూడటంతో భారతదేశం పట్ల నాకు చాలా ఇష్టం ఏర్పడిందని రష్యా దేశం రుక్వేనియా ప్రాంతానికి చెందిన రాందాస్ పేర్కొన్నారు. సోమవారం పులివెందుల పట్టణంలోని అంబకపల్లె రోడ్డులో ఉన్న నగరవనం పార్కును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేసుకున్నారు. రాందాస్ వేసుకున్న చొక్కా కూడా జై శ్రీరామ్ నామాలతో నిండి ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. పుట్టపర్తి సత్యసాయిబాబా శాంతి నిలయాన్ని సందర్శించి అక్కడి పద్ధతుల గురించి తెలుసుకున్నానని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న గండికోట, అహోబిలం ప్రాంతాలను చూడనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment