
విషద్రావణం తాగిన వ్యక్తి మృతి
చింతకొమ్మదిన్నె : మండలంలోని ఊటుకూరు గ్రామానికి చెందిన నీలం సుబ్బరాయుడు అనే వ్యక్తి ఆదివారం రాత్రి విషద్రావణం తాగాడు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్ సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. మృతుడు అతని మొదటి భార్య, కుమార్తె కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు.
పొలాల్లోకి వెళ్లేటప్పుడు
జాగ్రత్తగా ఉండాలి
లింగాల : పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు శ్రీనివాసులు, మహబూబ్ బాషా, గోపాలకృష్ణ రైతులకు సూచించారు. సోమవారం మండల కేంద్రమైన లింగాలలో రైతు వాసుదేవరెడ్డి పొలంలోని పులి అడుగు జాడలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు చిరుత పులి అడుగు జాడలపై ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్య
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో నాగముని (45) అనే మహిళ సోమవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ప్రసాద్‌కు కళ్లు సరిగా కనపడవు. టిఫెన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగించేవారు. మృతురాలి కుమారుడు దీపక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన తల్లి చిన్నచిన్న సమస్యలకు కూడా మానసికంగా బాధపడేదని, క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వినూత్న రీతిలో పశువైద్య విద్యార్థుల నిరసన
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని గోపవరం గ్రామం వద్ద ఉన్న పశువైద్య కళాశాలలో సోమవారం కళాశాల విద్యార్థులు తమకు స్టైఫండ్ పెంచాలని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కళాశాలలోని పశువైద్య శాలకు వచ్చిన పాడి గేదెకు వారు వినతి పత్రం అందించి నిరసన తెలిపారు. ఎంబీబీఎస్ మెడికల్ విద్యార్థులతోపాటు సమానంగా తమకు కూడా స్టైఫండ్ పెంచే వరకు సమ్మెను విరమించమని విద్యార్థులు పేర్కొన్నారు.

విషద్రావణం తాగిన వ్యక్తి మృతి

విషద్రావణం తాగిన వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment