
దొంగతనం కేసులో నిందితుడి అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌస్‌నగర్‌లో ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ సమీపంలో గంజికుంట కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ అల్తాఫ్‌ను రెండు దొంగతనాల కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. కడప డీఎస్పీ ఏ. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కడప టూటౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్‌ఐలు ఎస్.కె.ఎం.హుసేన్, సిద్దయ్యలతో కలిసి సోమవారం సంఘటన స్థలంలో తనిఖీలు చేశారు. అతనితో పాటు రూ. 80,000 విలువైన 10 గ్రాముల బంగారు ఆభరణాలు, 105.5 గ్రాముల బరువున్న రూ.10,000 విలువైన వెండి ఆభరణాలను సీజ్ చేశారు. మరో సంఘటనలో నిందితుడి వద్ద నుంచి రూ.26.400 విలువైన 12 గ్యాస్ సిలిండర్‌లను స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన సీఐ నాగార్జున, ఎస్‌ఐ, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌కుమార్ అభినందించారు.
సిబ్బంది సహకారంతోనే యూ డైస్ విజయవంతం
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ఎంఈఓలు, సమగ్రశిక్ష, ఎంఆర్‌సీ సిబ్బంది సహకారంతోనే యూ డైస్ విజయవంతం అయిందని డీఈఓ డాక్టర్ షంషుద్దీన్, సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజులు పేర్కొన్నారు. సోమవారం కడప నగరంలోని ఎస్‌పీజీ చర్చి సమావేశ మందిరంలో మండల విద్యాశాఖధికారులు, మండల ఎంఐఎస్ కో ఆర్డినేటర్‌లు, కంప్యూటర్ ఆపరేటర్‌లు, అకౌంటెంట్లు, సీఆర్‌పీ (సీఆర్‌ఎంటీ )లకు యూ –డైస్ నమోదులో జరిగిన తప్పులను సరిచేసేందుకు, సమగ్ర శిక్ష వార్షిక ప్రణాళిక, బడ్జెట్ 2025–26 లకు సంబంధించి ఒక్క రోజు వర్కుషాప్ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూ డైస్ లో జరిగిన తప్పులను ఎట్టి పరిస్థితుల్లో సరి చేయాలన్నారు. సమగ్రశిక్ష ఎంఐఎస్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ లక్ష్మినరసింహరాజు మాట్లాడుతూ సమగ్రశిక్ష వార్షిక ప్రణాళిక, బడ్జెట్‌కు సంబంధించిన సమాచారం మండలాల నుంచి అప్‌డేట్ సమాచారాన్ని జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి అందించాలన్నారు. డీఈఓ కార్యాలయం ఏఎస్‌ఓ బ్రహ్మానందరెడ్డి, ఏపీఓ జాలాపతిలు పవర్ పాయింట్ ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు వీరేంద్ర, దశరథరామిరెడ్డి, రమణమూర్తి పాల్గొన్నారు.
12 గ్యాస్ సిలిండర్లు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment