
కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది
కలసపాడు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని తెల్లపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కడప రమణారెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు. అనంతరం తెల్లపాడు, దూలంవారిపల్లె గ్రామాల్లో వైఎస్సార్ సమసమాజ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడవద్దని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు మాసాలైనప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఉద్యానశాఖ రాష్ట్ర సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల అధ్యక్షుడు కె.రమణారెడ్డి, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు అంకన గురివిరెడ్డి, సూదా రామకృష్ణారెడ్డి, సుదర్శన్, పురుషోత్తంరెడ్డి, బి.నారాయణ యాదవ్, చిత్తా రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, జి.నారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment