
విలేకరిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : పార్వతీపురం మన్యం జిల్లా మకువా మండల ప్రజాశక్తి విలేకరి రామారావుపై దాడి చేసిన అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు వేణుగోపాల్ నాయుడును తక్షణమే అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దాడిని నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి నేతలు పాల్పడుతున్న అవకతవకలు, అక్రమాలను వెలుగులోకి తీసుకు వస్తున్నారన్న కక్షతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి అల్లరిమూకలను టీడీపీ నాయకులు బహిష్కరించాలని కోరారు. దాడులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన సందర్భాల్లో ఏ సెక్షన్లు వర్తిస్తాయో పాత్రికేయులపై దాడి చేసిన వారిపై కూడా అవే సెక్షన్లను వర్తింపజేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకు రావాలన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా గౌరవాధ్యక్షుడు భూమిరెడ్డి శ్రీఽనాథ్‌రెడ్డి, ఏపీడబ్ల్యు జేఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్‌రాజు, ప్రధాన కార్యదర్శి నూర్‌బాషా, జర్నలిస్టు సంఘాల నాయకులు కాటిబోయిన నారాయణ, రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో విశ్వేశ్వరనాయుడుకు వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment