బ్రహ్మంగారిమఠం : మండలంలోని మల్లేపల్లె పంచాయతీలో జరుగుతున్న బెంగళూరు– అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు పనులను సోమవారం భూ నిర్వాసితులు మల్లేపల్లె దగ్గర అడ్డుకున్నారు. అధికార పార్టీ మల్లేపల్లె సర్పంచ్ చిలమల లక్ష్మిదేవి భర్త నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వాసితులతో రోడ్డు పనులను అడ్డుకున్నారు. రోడ్డు కోసం భూములు కోల్పోయిన తమకు తక్షణం నష్టపరిహారం జిల్లాలో ఇతర మండలాల్లో ఇచ్చిన విధంగా ఎకరాకు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ మండల నాయకుడు పెదుల్లపల్లె ప్రభాకర్ కార్యకర్తలతో కలసి మద్దతు పలికారు. తహసీల్దార్ దామోదర్‌రెడ్డి అక్కడికి చేరుకొని భూ నిర్వాసితులతో మాట్లాడారు. నష్టపరిహారం అధికంగా వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
శ్రీకృష్ణదేవరాయల ను విస్మరించడం దారుణం
కడప కార్పొరేషన్ : విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, రాయలసీమను రతనాల సీమగా మార్చిన శ్రీకృష్ణదేవరాయలకు కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి దండ వేయకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోటక్రిష్ణ అన్నారు. సోమవారం స్థానిక మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విజయ నగర చక్రవర్తిగా ఆయన సుపరిపాలన అందించారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతిని ప్రజలంతా ఘనంగా నిర్వహించారని, కడప ఎమ్మెల్యే మాత్రం ఆయనకు దండ వేయకపోవడం సరికాదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కిరణ్, గుంటి నాగేంద్ర, రెడ్డి ప్రసాద్, ఉమామహేశ్వరి, సుదర్శన్, రామక్రిష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment