
●వైఎస్సార్‌సీపీ ఎంపీలు గతంలోనే ప్రయత్నాలు..
చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి కువైట్ ఎంబసీ మిసాల్ ముసాపా ఆల్–షామితి..ఆయనను తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కలిశారు. కువైట్ నుంచి విమానాలు తిరుపతి రన్‌వేపైకి తీసుకురావాలని కోరారు. ఉభయ వైఎస్సార్ జిల్లాలో రెండు లక్షలకుపైగా కువైట్‌లో జీవనోపాధి కోసం వెళుతుంటారు..వస్తుంటారు..వీరిని దృష్టిలో వుంచుకొని ఎడారి విమానం తిప్పాలని విన్నవించారు.
రాజంపేట : ఉభయ వైఎస్సార్ జిల్లా నుంచి ఎడారి దేశాల విమానాలకు రెక్కలొచ్చేదెప్పుడోనని గల్ఫ్‌వాసుల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రం నుంచి కేంద్ర పౌర విమానాయనశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రామ్మోహన్‌నాయుడుపై తిరుపతి ఎయిర్‌పోర్టులో ఎడారిదేశాలకు విమానయాన సౌకర్యం కల్పించే బాధ్యత పడింది. ఇవి తిరుపతి రన్‌వేపై ఎగిరితే తమ పయనానికి ఇక ఇక్కట్లు ఉండవని వేయికళ్లతో వలసజీవులు ఎదురుచూస్తున్నారు.అయితే పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సముద్రయానం నుంచి విమానాల దాకా..
గల్ఫ్‌దేశాలకు వెళ్లేవారు నాలుగు దశాబ్దాల కిందట సముద్రయానం ద్వారా చేరుకునేవారు. వారాల కొద్దీ పయనించి ఎడారిదేశాలకు చేరుకునేవారు. అప్పట్లో గల్ఫ్ జీవనోపాధికి డిమాండ్ లేని రోజుల్లో మాట ఇది. రానురాను అక్కడ పనిచేసే ఉన్నతంగా జీవనం సాగించవచ్చని, తమ కుటుంబాలు ఆర్ధికంగా బలోపేతం కావచ్చనే భావనతో ఎడారి పయనాలు అధికమయ్యాయి. ముఖ్యంగా రాజంపేట, రాయచోటి, కడప, బద్వేలు, రైల్వేకోడూరుతో పాటు ఉభయ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి 2 లక్షల మంది ఎడారిదేశాలపై ఆధారపడి జీవిస్తున్నారు
కరోనా సమయంలో గల్ఫ్‌లో కరోనా సోకిన వారిని విమానాల ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేర్చారు. అప్పట్లో ఏపీఎన్‌ఆర్‌టీ ద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో కేంద్రప్రభుత్వం గల్ఫ్‌లో కరోనా బాధితులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. తిరుపతి ఎయిర్‌పోర్టుకు నేరుగా విమానాల్లో తీసుకొచ్చి, వారిని జిల్లాలో ఏర్పాటు చేసిన కరోనా నివారణ శిబిరాల్లో ఉంచి, తర్వాత ఇళ్లకు క్షేమంగా చేర్చిన సంగతి విధితమే. కాగా అంతర్జాతీయసర్వీసులు తీసుకొచ్చేందుకు గత రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎడీసీఎల్) ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత అధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి అంతర్జాతీయస్ధాయిలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్న కలలు ఇంకా కలలాగే మిగిలిపోతున్నాయి.
వ్యయప్రయాసలతో .
చైన్నె, కర్ణాటక, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు వ్యయప్రయాసలతో వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా అనేక మంది భాష రాక ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే మోసపోతున్నారు. దూరప్రయాణంతో అనేక అవాంతరాలు, ప్రమాదాలబారిన పడుతున్నారు.విమానటికెట్‌తో పాటు ఎయిర్‌పోర్టుకు చేరుకునే ఖర్చులు భరించలేకపోతున్నారు. 2015లో తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయహోదా కల్పించారు. కానీ ఆ స్ధాయిలో విమాన సర్వీసులను తీసుకురాలేదన్న అపవాదును కేంద్రప్రభుత్వం మూటకట్టుకుంది.
ఉభయ జిల్లాల నుంచి..
రాయలసీమలో ప్రధానంగా ఉభయ వైఎస్సార్ జిల్లాల నుంచి ఎడారిదేశాలకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. జీవనోపాధికోసం కువైట్, ఖత్తర్, దుబాయ్, సౌదీ అరేబియా,బహ్రెయిన్, అబుదాబి, లెబనాన్, మస్కట్ దేశాలకు వెళతారు. ఉద్యోగరీత్యా, విద్య కోసం అమెరికా, కెనడా, సౌతాఫ్రికా,శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో స్ధిరపడిన వారు ఉన్నారు. వీరు కూడా విదేశీయానం చేయాల్సివస్తే కష్టతరంగానే ఉంది. భాష రాని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించాలంటే గగనమవుతోంది. గల్ఫ్‌దేశాలకు వెళ్లే వారు అధికంగా 60 శాతం చదువురాని వారు ఉన్నారు. మోసాలపాలైన వారు చాలామంది ఉభయ జిల్లాలో ఉన్నారు.
గల్ఫ్ విమాన సర్వీసులు
తీసుకురావాలి
తిరుపతి ఎయిర్‌పోర్టులో విదేశీ విమాన సర్వీసులను తీసుకొచ్చేందుకు వైస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రయత్నాలు జరిగాయి. ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై ఇప్పటి వరకు కరుణించలేదు. గల్ఫ్‌వాసులకు విమానయాన సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. గత రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రయత్నాలు చేశాయి. – పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీ,
రాజంపేట
కేంద్రం తక్షణమే
స్పందించాలి
రాయలసీమ జిల్లా వాసులకు అందుబాటులో ఉండే తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి విదేశీ విమాన స ర్వీసులను ప్రవేశపెట్టాలి.దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. విదేశాలకు వెళ్లాలంటే ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. చైన్నె, బెంగళూరు తదితర రాష్ట్రాలకు చెందిన విమానశ్రయాల ద్వారా వెళ్లాలంటే కష్టతరంగా ఉంది. కువైట్ ఎంబీసీకి తిరుపతి ఎంపీతో కలిసి ఈ విషయం తెలియజేశాం. కనీసం కడపోళ్ల కోసం కువైట్ నుంచి విమానం నడిపించాలి
– మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు
తిరుపతి రన్‌వేపైకి.. ఎడారి విమానాలెప్పుడో!
ఎదురుచూపుల్లో ఉభయ జిల్లాల
గల్ఫ్‌వాసులు
ఇప్పటికై నా కేంద్రం కరుణించేనా !
తిరుపతి, రాజంపేట లోక్‌సభ సభ్యులు తమ వంతుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను రన్‌వే మీదకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో తిరుపతి నుంచి విదేశీయానంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ విషయంలో కేంద్రప్రభుత్వం కనికరించలేదు. ఫలితంగా రాయలసీమవాసులకు విదేశీయానం గగనతరంగా మారింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తిలు కువైట్ ఎంబసీని కలిసి గల్ఫ్ విమానాలు తిరుపతి విమానశ్రయం నుంచి రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

●వైఎస్సార్‌సీపీ ఎంపీలు గతంలోనే ప్రయత్నాలు..

●వైఎస్సార్‌సీపీ ఎంపీలు గతంలోనే ప్రయత్నాలు..

●వైఎస్సార్‌సీపీ ఎంపీలు గతంలోనే ప్రయత్నాలు..

●వైఎస్సార్‌సీపీ ఎంపీలు గతంలోనే ప్రయత్నాలు..
Comments
Please login to add a commentAdd a comment