
రంగ రంగ.. వైభవంగా !
పులివెందుల : పులివెందుల పట్టణంలో శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీరంగనాథస్వామి రథోత్సవ వేడుకలు కనుల పండువగా జరిగాయి. రథోత్సవ వేడుకలను తిలకించేందుకు పట్టణ పరిధిలోని భక్తులతోపాటు వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి కాయ కర్పూరాలు సమర్పించారు. స్వామి వారి తేరు (రథం) కింద గుమ్మడికాయలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. దారి పొడవునా గోవింద నామస్మరణలతో రథాన్ని కదిలించారు. తేరు ప్రారంభానికి ముందు అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ విశేష పూజలు జరిపించారు. ఉభయదారులకు అర్చనలు చేశారు. తేరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్‌ఛార్జి వైఎస్ మనోహర్‌రెడ్డితోపాటు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మెన్ చిన్నప్ప, అంకాలమ్మ ఆలయ చైర్మన్ బ్యాటరీ ప్రసాద్, కౌన్సిలర్లు కోడి రమణ, పార్నపల్లె కిశోర్, మాజీ బలిజ సంఘం అధ్యక్షుడు సోపాల వీరా, వివిధ శాఖల అధికారులతో స్వామి వారికి పూజలు జరిపించారు. ఆలయ మర్యాదలతో ఆలయ చైర్మన్ సుధీకర్‌రెడ్డి, ఈఓ వెంకటరమణ వారికి శాలువతో సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. రథోత్సవం స్థానిక పూలంగళ్ల సర్కిల్ నుంచి కొనసాగి శ్రీనివాస హాలు రోడ్డు, ముత్యాల వారి వీధి, గుంత బజార్, బంగారు అంగళ్ల మీదుగా తిరిగి పూల అంగళ్ల సర్కిల్‌కు చేరుకుంది. రథోత్సవ సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షించారు.
కదిలింది బ్రహ్మరథం
దారిపొడవునా
గోవిందా నామస్మరణలు, భజనలు

రంగ రంగ.. వైభవంగా !
Comments
Please login to add a commentAdd a comment