
అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సభా భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
● సీకే దిన్నె మండలం ఊటుకూరు గ్రామ పొలం సర్వే నెంబరు 182/3ఏ1, 182/3ఏ2, 182/3ఏ3, 182/3ఏ5లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అర్హులైన ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలాలుగా ఇవ్వాలని దళిత భూ సాధన పోరాట సమితి అధ్యక్షులు ఓబులపతి, నాయకులు ఆర్‌ఎన్ రాజు, వెదురూరు బాబు తదితరులు కోరారు.
● విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరసింహులు అనే వ్యక్తి 4 ఎకరాల 55 సెంట్ల తన పట్టా భూమిని ఆక్రమించాడని, ఆయనపై చర్యలు తీసుకుని తన భూమి తనకు అప్పగించాలని సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామానికి చెందిన చిన్న గంగన్నగారి నారామ్మ అనే వృద్ధురాలు కలెక్టర్‌ను వేడుకున్నారు.
● అంగన్వాడీ సెంటర్ల అవసరాల కోసం ప్రభు త్వం ఒక్కో సెంటర్‌కు రూ. 3000 చొప్పున ఇచ్చిందని, ఆ మొత్తాన్ని వినియోగించడంలో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ నిర్వహించి బాధ్యులపై తగు చర్యలు చేపట్టాల ని సీఐటీయూ నాయకులు మనోహర్, చంద్రారెడ్డి తదితరులు విన్నవించారు.
● కడప దౌలతాపురానికి చెందిన నాగరాజు పెన్షన్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, మెప్మా పీడీ, ఎస్డీసి వెంకటపతి పాల్గొన్నారు.
విద్యుత్ ప్రమాదాలను అరికడదాం
విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు వీడియో, ఆడియో, వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేబుల్ నెట్వ ర్క్, టీవీలు, ప్రొజెక్టర్ల ద్వారా విద్యుత్ భద్రత నియమాలు గురించి ప్రదర్శనలు నిర్వహిస్తే ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి విధిగా ఎర్తింగ్, ప్రమాణాలు కలిగిన విద్యుత్ పరికరాలను వాడాలన్నారు. అలాగే వ్యవసాయ బోర్ల వద్ద భద్రత నియమాలు విధిగా పాటించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ రమణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment