
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యను విన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ కె. ప్రకాష్ బాబు, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పి.ఎస్ డి.ఎస్పీ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి
హోం గార్డ్స్ సిబ్బంది విధుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లాలోని హోం గార్డు సిబ్బందికి రెండు వారాల పాటు నిర్వహించే మొబిలైజేషన్ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోం గార్డ్ విధుల్లో చేరేముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. మొబిలైజేషన్ లో ట్రాఫిక్ రెగ్యులేషన్, పర్సనాలిటీ డెవలప్ మెంట్, ఫిజికల్ ఫిట్ నెస్, మాబ్ కంట్రోల్, బందోబస్తు విధులు, డ్రిల్ తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తామని ఎస్పీ తెలిపారు. మొబిలైజేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్.పి (ఏ.ఆర్) బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్‌ఐ లు శ్రీశైల రెడ్డి, ఆనంద్, వీరేష్, ఆర్‌ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, హోమ్ గార్డులు పాల్గొన్నారు.
‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో
ఎస్పీ ఈజీ అశోక్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment