
విద్యార్థిని ఆత్మహత్య
– పాఠశాలకు వెళ్లి చదువుకోలేక...!
కడప అర్బన్ : పాఠశాలకు వెళ్లడం లేదని మందలించినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడప నగర శివారులోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కడప చిన్నచౌక్ పోలీసుల ప్రాథమిక విచారణ, మృతురాలి బంధువుల వివరాలిలా వున్నాయి. దేవకుమార్, ప్రభావతిల కుమారుడు మస్తానయ్య, సన్నీ కుమార్తె సుచిత్ర ఉన్నారు. మస్తానయ్య తన తండ్రితో పాటు బేల్దారిపనికి వెళుతున్నాడు. తల్లి ప్రభావతి ఇంటింటా పనులు చేసి జీవనం సాగించేది. సుచిత్ర మున్సిపల్ మెయిన్ హైస్కూల్‌లో పదోతరగతి చదువుతోంది. సుచిత్ర తన అనారోగ్యం కారణాలతో నెలకు 15 రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లేది. హాజరు సరిగా లేక ఇటీవల పాఠశాలలో ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులను ఆరా తీశారు. దీంతో మానసిక ఆవేదనకు గురైన విద్యార్థిని సుచరిత తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు వెళ్లిపోయిన తరువాత ఇంటిలోపల గడియ వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుప్రక్కల వాళ్లు గమనించి తల్లిదండ్రులకు, పోసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని చిన్నచౌక్ సీఐ ఓబులేసు ఆదేశా మేరకు ఎస్‌ఐ పి.రవికుమార్, తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రాథమికంగావిచారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీధి కుక్కల దాడిలో మేకల మృతి
వేంపల్లె : పట్టణంలోని కడప రోడ్డులో నివాసముంటున్న సుధాకర్‌కు చెందిన మేకలపై మంగళవారం తెల్లవారుజామున వీధి కుక్కలు దాడి చేశాయి. నాలుగు మేకలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. కుటుంబ పోషణకు మేక పిల్లలను పెంచుకుంటున్నానని, కుక్కల దాడితో రూ.50 వేల నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందించేలా చూడాలని కోరారు.
బొలెరో వాహనం ఢీకొని పొట్టేళ్లు దుర్మరణం
కొండాపురం : కడప–తాడిపత్రి నాలుగు వరసల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో పొట్టేళ్లు మృతి చెందాయి. బాధితుడి వివరాల మేరకు.. చౌటిపల్లె గ్రామానికి చెందిన సుబ్బారెడ్డికి చెందిన పొట్టేళ్లు కడప–తాడిపత్రి రహదారి దాటుతున్నాయి. మండలంలోని గండ్లూరు సమీపంలో బొలెరో వాహనం వేగంగా ఢీకొనడంతో 12 పొట్టేళ్లు మృతి చెందాయి. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు.
విద్యుత్తు తీగలు తగిలి.. కాలిన టిప్పర్
ఎర్రగుంట్ల : మండలంలోని చిన్నదండ్లూరు సమీపంలో విద్యుత్తు తీగలు తగలి టిప్పర్ కాలిపోయిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చిన్నదండ్లూరు గ్రామానికి గ్రావెల్ రోడ్డు వేస్తున్నారు. ఈ తరుణంలో టిప్పర్‌లోని మట్టిని రోడ్డుపై వేసేందుకు ట్రాలీ పైకెత్తగా..పైన విద్యుత్తు తీగలను తాకింది. దీంతో ప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. కొలవలి గ్రామానికి చెందిన డ్రైవర్ నాగార్జునకు గాయాలయ్యాయి. కలమల్ల పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment