
ఇమామ్, మౌజన్లకు అన్యాయం
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలోని మౌజన్లు, ఇమామ్‌లకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మదీనా దస్తగిరి అన్నారు. స్థానిక మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇమామ్‌లు, మౌజన్లకు నెలకు రూ.15వేల చొప్పున ఇచ్చేవారని, 2024లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 11 నెలలుగా వారికి గౌరవవేతనం ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకూ వారికి రూ.90 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం రూ.45కోట్లు ఇవ్వడానికి జీవో విడుదల చేయడం అన్యాయమన్నారు. రానున్న రంజాన్ మాసంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని, ప్రభుత్వం ఆ మిగిలిన రూ.45 కోట్లు విడుదల చేయాలన్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు ఎస్‌ఎండీ.షఫీ మాట్లాడుతూ గతంలో హజ్‌కు పోయే వారికి విజయవాడ నుంచి అధిక టికెట్లు ఉంటే అప్పటి సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆ భారాన్ని ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులిచ్చారని గుర్తు చేశారు. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ మాత్రమే వ్యతిరేకించిందని గుర్తు చేశారు. హజ్ కమిటీ మాజీ ఛైర్మెన్ గౌస్‌లాజం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముస్లిం, మైనార్టీలకు ఒరిగిందేమీ లేదన్నారు. 3529 మందిని ఒకేసారి హజ్‌కు పంపిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. జగనన్న ప్రభుత్వంలో ముస్లింలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.23వేల కోట్లు జమ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్‌బాషా, అతావుల్లా, మియ్యా, అహమ్మద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment