
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
పులివెందుల రూరల్: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. మంగళవారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని ఆయన నివాసంలో ఎంపీ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీ పథకాలలో ఒకటీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. అధికారం కోసం చంద్రబాబు వందలాది హామీలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేసి గెలిపించామా అని బాధపడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఆయన ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి చంద్రబాబు
ప్రజా దర్బార్‌లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment