చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణం, లాకప్ గదులు, రికార్డులను పరిశీలించారు. మహిళలకు సంబంధించిన కేసులను త్వరగా పరిశీలించి న్యాయం చేయాలని, రికార్డులు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి బ్లాక్ స్పాట్స్ బోర్డులు ఏర్పాటుచేయాలని తెలిపారు. మట్కా, క్రికెట్, బెట్టింగ్ తదితర నేరాల పట్ల కఠినంగా వ్యవహరించవలసిందిగా ఆదేశించారు. ఎస్పీ వెంట ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, చింతకొమ్మదిన్నె సీఐ శివశంకర్ నాయక్, ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment