మాజీ సీఎం జగన్ రక్షణ.. కూటమి ప్రభుత్వానికి పట్టదా?
ఖాజీపేట : మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కనీస రక్షణ కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించిందని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ మాజీ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. దుంపలగట్టు గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు మిర్చియార్డు రైతుల సమస్య తెలుసుకునేందుకు వెళ్లిన జగన్‌కు కనీసం ఒక్క పోలీసును కూడా రక్షణకు నియమించక పోవడం, కనీసం ట్రాఫిక్ క్లియరెన్స్ చేయక పోవడం దురదృష్టకరం అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఎవ్వరికీ మద్దతు ఇవ్వలేదని అన్నారు. అలాంటప్పుడు ఎన్నికల ఆంక్షలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు కనీసం రూ.20వేలు రైతు భరోసాను అందించలేక పోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment