కడప అగ్రికల్చర్ : ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంపొందించి ఔత్సాహిక రైతులను ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రకృతి వ్యవసాయం అమలు తీరు, విస్తరణపై ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలను కల్పించడంలో వైఎస్‌ఆర్ జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని తెలిపారు. సంప్రదాయ వ్యవసాయ సాగు పద్ధతులను అమలు చేసేందుకు.. గ్రామాలను యూనిట్లుగా తీసుకుని వీవోలు, స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో... న్యూట్రీగార్డెన్స్ ఏర్పాటుకు మ్యాపింగ్ చేయాలన్నారు. ఎస్.వి.ప్రవీణ్ కుమార్, ఆనంద్‌నాయక్, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసులురెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
డీఏఓ అయితా నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment