చక్రాయపేట : మండలంలోని గొట్లమిట్ట అంగన్‌వాడీ టీచర్ లింగారెడ్డి నిర్మల మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లినట్లు చక్రాయపేట ఎస్సై కృష్ణయ్య తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. గొట్లమిట్ట నుంచి వచ్చి వేంపల్లె గాలివీడు ప్రధాన రహదారిపై బస్ షెల్టర్ వద్ద నిర్మల వేచియున్నారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై రావడంతో ఆమె వారిని లిఫ్ట్ అడిగిందన్నారు. వారు ఆమెను ఎక్కించుకొని బాట్లోపల్లె సమీపంలోకి రాగానే బండిలో పెట్రోల్ అయిపోయిందని కిందకు దిగమన్నారు. బండి దిగగానే మెడలో ఉన్న ఒకటిన్నర తులం బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. ఆమె ఫిర్యాదు చమేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment