రాజకీయ ఒత్తిళ్లతో చెక్ పవర్ రద్దు చేసే యత్నం
కడప సెవెన్‌రోడ్స్ : అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి తన చెక్ పవర్ రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని వీఎన్.పల్లె మండలం బుసిరెడ్డిపల్లె పంచాయతీ సర్పంచ్ లింగారెడ్డి అనూరాధ ఆరోపించారు. ఆమె భర్త, రాష్ట్ర మైనింగ్ మాజీ డైరెక్టర్ ఎల్.వీరప్రతాప్‌రెడ్డితో కలిసి డీపీఓ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనూరాధ మాట్లాడుతూ బుసిరెడ్డిపల్లె నుంచి గంగనపల్లె వరకు లక్షా 14 వేల రూపాయలతో గ్రావెల్ రోడ్డు నిర్మించామని, ఏఈ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. బిల్లు ఇంతవరకూ తీసుకోలేదన్నారు. రోడ్డు పనుల్లో తాము అవినీతికి పాల్పడ్డామని అధికార పార్టీకి చెందిన లైన్‌మెన్ ప్రసాద్‌రెడ్డి, నల్లబల్లె రమణారెడ్డి డీపీఓకు ఫిర్యాదు చేశారన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన డీపీఓ రాజ్యలక్ష్మి విచారణ బాధ్యతను పులివెందుల డివిజనల్ పంచాయతీ అధికారికి అప్పగించారన్నారు. తమది ఫ్యాక్షన్ గ్రామమని, డీపీఓ వైఖరి కారణంగా కక్షలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇదే వైఖరి కొనసాగితే తాను, తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. ఈ విషయాన్ని తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
నివేదిక ఆధారంగా చర్యలు : డీపీఓ
పులివెందుల డీఎల్‌పీఓను విచారణకు నియమించామని, నివేదిక పరిశీలించిన తర్వాత చర్యలు చేపడతామని డీపీఓ రాజ్యలక్ష్మి వివరణ ఇచ్చారు. అభియోగాలు రావడం సహజమని, ఆడిట్ జరిగిందా? లేదా? అనే దానితో సంబంధం లేదని తెలిపారు. తమపై రాజకీయ ఒత్తిళ్లు లేవని, చట్ట వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టబోమన్నారు. తప్పు జరిగిఉంటే ఏఈ బాధ్యులవుతారని తెలిపారు.
డీపీఓ కార్యాలయం ఎదుట
సర్పంచ్ నిరసన
Comments
Please login to add a commentAdd a comment