అధికార పార్టీ అండతో ఇంటి స్థలం ఆక్రమణ
కడప సెవెన్‌రోడ్స్ : అధికార తెలుగు దేశం పార్టీ నాయకుల అండ చూసుకుని తమ గ్రామానికి చెందిన పెరుగు నాగమ్మ, ఇతరులు తన ఇంటి స్థలం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మైదుకూరు మండలం నంద్యాలంపేట గ్రామానికి చెందిన చిన్న పాలయ్య బుధవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి ఫిర్యాదు చేశారు. నంద్యాలంపేట గ్రామ పొలం సర్వే నెంబరు 290/ఎలో ఎనిమిదిన్నర సెంట్ల ఇంటి స్థలం ఉందన్నారు. దీనిపై మైదుకూరు సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. ఒకవైపు విచారణ ముగిసి న్యాయస్థానం తీర్పు వెలువడకముందే టీడీపీ నాయకులు దౌర్జన్యంగా స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. తాము అభ్యంతరం చెప్పగా దౌర్జన్యానికి దిగుతున్నారని, పోలీసుస్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. కోర్టు తుది ర్పు వచ్చే వరకు ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని, ఎవరికీ ప్రవేశం లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment