● గ్రామాల్లో బెల్ట్ట్‌షాపులు..
మైదుకూరు నియోజకవర్గంలో మద్యం యధేచ్ఛగా లభిస్తోంది. ఆయా గ్రామాల్లో బెల్ట్ షాపులు తిష్టవేశాయి. చివరికి బ్రహ్మంగారిమఠం లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కూడా బెల్ట్‌షాపులు వెలిశాయి. ఆ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని స్వయంగా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పటికై నా బెల్డ్ షాపు బ్రహ్మంగారిమఠంలో కట్టడి చేశారా? అంటే లేదు. కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే స్థాయికి అది ఎంత పని? వాస్తవంగా ఎకై ్సజ్, పోలీసులు అధికారులు తనిఖీలకు వెళితే ఎమ్మెల్యే సహాయకుడు నుంచి వెంటనే అధికారులకు ఫోన్ వస్తున్నట్లు పలువురు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని అధికారులు వాపోతున్నారు. అక్రమ కార్యకలాపాలను కట్టడి చేయాలని భావించి చర్యలు చేపడితే ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు నుంచి ఫోన్లు వస్తున్నట్లు వాపోతున్నారు. నిజంగా మైదుకూరులో అవినీతి అధికారులు తిష్టవేసి ఉన్నారా...అధికారులను బెదిరించి దారికి తెచ్చుకోవాలనే తపనతో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారా...అన్న విషయం సందిగ్ధంగా ఉందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అవినీతి అధికారులు తిష్టవేసి ఉంటే అలాంటి వారికి పోస్టింగ్ ఇప్పించిన నాయకులెవ్వరు? విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. అధికారుల విధులకు పాలకపక్షం ఆటంకం కల్గించకుంటే అదే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పలువురు వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment