‘స్టాఫ్ నర్స్’ ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల
కడప రూరల్: కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు, వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. ఈ జాబితాను సీఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22వ తేదీలోపు తమ అభ్యర్థనలను తెలపాలని సూచించారు. 28వ తేదీన ఫైనల్ మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వివరించారు.
23న హాకీ సీనియర్ పురుషుల జిల్లా జట్టు ఎంపిక
పులివెందుల టౌన్: పట్టణంలోని స్థానిక వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ టర్బ్ హాకీ గ్రౌండ్‌లో ఈనెల 23న ఆదివారం ఉదయం హాకీ సీనియర్ పురుషుల జిల్లా జట్టు ఎంపికలు జరగనున్నాయని హాకీ జిల్లా సెక్రటరీ ఎం.శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న హాకీ క్రీడాకారులు మార్చి 6 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పురుషుల హాకీ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఎంపికలకు పాల్గొనే క్రీడాకారులు 01–01–1991 తర్వాత 31–12– 2005 ముందు జన్మించి ఉండాలని వివరించారు. క్రీడాకారులు ఒరిజనల్ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు.
రేపు జాబ్‌మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: పోరుమామిళ్ల పట్టణంలోని వెలుగు కార్యాలయంలో ఈనెల 21వ తేదిన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాఽధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ నిర్వహించే ఈ జాబ్‌మేళాలలో నవత ట్రాన్స్‌పోర్టు కంపెనీలో క్లర్క్, డ్రైవర్, క్లీనర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. అలాగే డొనో బీపీఓ అండ్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో టెలాకాలింగ్ ఆఫీర్, ఎల్‌ఐసీలో బీమా సాక్షి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.. ఎంపికైన వారికి రూ.7 వేల నుంచి రూ. 35 వేల వరకు వేతనం హోదాను బట్టి లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఫర్నీచర్ సరఫరాకు
కొటేషన్లు ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: కడప స్పెషల్ పొక్సో కోర్టు కోసం కొత్త ఫర్నీచర్ వస్తువుల సరఫరా కోసం సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ జడ్జి జి. శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అన్ని టాక్స్‌లతో కలుపుకొని 7 ఐరన్ అల్మారాలు, 1ఐరన్ ర్యాక్, 8 ఆఫీసు టేబుల్స్, 3 కుషన్ ఛైర్స్, 30 ‘ఎస్’ౖ టెప్ మార్క్ ఛైర్స్, ఒక క్రోన్ చైర్, 5 ఐరన్ స్టూల్స్, 2 కోట్ హాంగర్స్, 3 ఉడెన్ బెంచులు, ఒక సోఫా సెట్, 5 టీ పాయి, ఒక డ్రైనింగ్ టేబుల్, ఒక ప్లాస్టిక్ చైర్ మొత్తం 13 రకాల ఫర్నిచర్ వస్తువుల కోసం సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నామన్నారు.టెండరుదారు సమర్పించే కొటేషన్ కవరు పైన ‘కొటేషన్ ఫర్ సప్లయ్ అండ్ ఇన్‌స్ట్రాలేషన్ ఫర్ ఫర్నీచర్ ఐటమ్స్’అని రాయాలన్నారు. నమోదు చేసిన సంబంధిత షీల్డు కొటేషన్లను ఈనెల 21వతేది సాయంత్రం 5 గంటల లోపు. ప్రిన్సిపల్ డీస్ట్రిక్ట్ కోర్టు, కడపలో సమర్పించాలన్నారు. వివరాల కోసం వెబ్ సైట్ కడప.డికోర్ట్సు,జీఓవీ.ఇన్‌లో చూడవచ్చని, అలాగే 08562–254963 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
జిల్లాకు యూరియా రాక
కడప అగ్రికల్చర్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు బుధవారం 2600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందులో వైఎస్సార్‌జిల్లాకు 1300 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 1000 మెట్రిక్ టన్నల యూరియాను మార్క్‌ఫెడ్‌కు అలాట్ చేసినట్లు వివరించారు. అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మార్క్‌ఫెడ్‌కు 300 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించామని పేర్కొన్నారు. రైతులు యూరి యా కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment